2030 నాటికి రూ.50వేల కోట్లకుపైగా రక్షణ ఎగుమతులు

2030 నాటికి రూ.50వేల కోట్లకుపైగా రక్షణ ఎగుమతులు

కాన్పూర్: 2029-30 నాటికి భారత్ రూ. 50వేల కోట్లకు పైగా రక్షణ ఎగుమతులు చేస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ ఉత్పత్తిలో స్వావలంబన కోసం విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 

మిలిటరీ లాజిస్టిక్స్, డిఫెన్స్ ఇన్నోవేషన్ లో పురోగతి సాధించేందుకు BEML , హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తో ఐఐటీ కాన్పూర్  సహకారం, ఇంక్యుబేషన్ ప్రయత్నాలను బలోపేతానికి కాన్పూర్ యూనివర్సి టీతో ఒప్పందంపై సంతకం చేశారు. 

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కాన్పూర్ లో జరిగిన 65వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్.. దేశం దిగుమతి చేసుకునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో తన ప్రభావాన్ని చూపుతోంది. ఆయా రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన టెక్నాలజీగా ఏఐ ఉంటుంది.ఈ టెక్నాలజీలో స్కిల్స్ పెంచుకునేందుకు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత పోటీని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, వినియోగం పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం భారత్ టెక్నాలజీ డెవలప్ మెంట్ లో అగ్రస్థానంలో ఉందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీపై పట్టుసాధించాల్సిన అవసరం ఉందన్నారు.