‘పుష్ప’ మూవీ డైలాగ్ చెప్పిన కేంద్ర మంత్రి

త్వరలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో రాజ్ నాథ్.. ఓ సినిమా డైలాగ్ వాడి అందరినీ ఆకర్షించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా డైలాగ్ చెప్పారు. ఆ సినిమాలోని పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ ను వాడుకున్నారు. అక్కడ సీఎం అభ్యర్థిగా ఉన్న పుష్కర్ ధామి గురించి మాట్లాడుతూ.. ‘పుష్కర్ అంటే పువ్వు అని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారు. కానీ, పుష్కర్ అంటే పువ్వు మాత్రమే కాదు ఫైర్ కూడా’ అంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ను అభివృద్ధి చేయడం వాజ్‌పేయి కల అని ఈ సందర్భంగా రాజ్ నాథ్ అన్నారు. గత ఐదేళ్ళలో బీజేపీ చేసిన పనులను గుర్తు చేసిన ఆయన..  ఉత్తరాఖండ్ ను ఆదర్శ మరియు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ను సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మార్చడం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కల అని, ఆ కలను సాకారం చేయడం కోసం సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకెళ్తోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

For More News..

కివీస్​తో ఏకైక టీ20లో ఇండియా ఉమెన్స్  ఓటమి

కంపెనీల్లో కొత్త కొలువుల జోరు