వైసీపీలో చేరిన జీవిత, రాజశేఖర్‌

సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంప‌తులు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోవారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వారు జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం జ‌గ‌న్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అయితే గతంలో వీరు (జీవిత, రాజశేఖర్)  వైసీపీలోనే ఉన్నారు. జగన్‌తో విభేదాలు కారణంగా.. వైసీపీ నుంచి వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి.. చంద్రబాబుకు మద్దతు పలుకుతూ టీడీపీలో చేరారు. ఇప్పడు మళ్లీ ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు న‌టి హేమ‌, టీవీ యాంక‌ర్ శ్యామ‌ల కూడా నేడు వైసీపీలో చేరారు.