రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్: అర్థరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం

రాజ్ తరుణ్తా కేసులో తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్‌ కు  మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్‌ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఆమెను రక్షించారు. పీఎస్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను.నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పు బట్టారు .నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు.రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు .మైండ్‌ గేమ్‌, గాసిప్స్‌తో విసిగిపోయాను.  మస్తాన్‌ కేసులో నేను కీలు బోమ్మను అయ్యాను.  ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను..  

కానీ మాల్వి నిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్‌తరుణ్‌, అతని తల్లిదండ్రులే.నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వీ మలోత్రా. నాకు తినడానికి తిండి లేదని మొత్తుకుంటున్నా. రాజ్‌తరుణ్‌తో మాల్వీ మల్హోత్రా ఎంజాయ్ చేస్తోంది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మోజులో పడి మారిపోయాడు. రాజ్‌తరుణ్‌ నా మరణాన్ని కోరుకుంటున్నాడు అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది.