
మెదక్ (చేగుంట), వెలుగు: తెలంగాణా ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ గా మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన తొడుపునూరి రాజు ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్లో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు జరగ్గా ఆయుష్ డైరెక్టర్ హరి చందన రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 56 వేల మంది ఫార్మసిస్టులు, 42 వేల మంది కెమిస్టులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల్లో మెదక్ జిల్లా నుంచి పోటీ చేసిన రాజు 4,763 ఓట్ల మెజారిటీతో ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ గా విజయం సాధించారు. ఆయనను జిల్లా మెడికల్ అసోసియేషన్ బాధ్యులు అభినందించారు.