కాకా వెంకటస్వామి స్మారక టోర్నీ విన్నర్​ రాజు లెవెన్​ టీం

కోల్​బెల్ట్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్మారకార్థం యూత్ కాంగ్రెస్, సోషల్​మీడియా వారియర్స్​ ఆధ్వర్యంలో మందమర్రిలో నిర్వహించిన క్రికెట్​ టోర్నమెంట్​ బుధవారం ముగిసింది. విజేతగా రాజు లెవెన్​ టీం నిలిచింది. మండల స్థాయిలో జరిగిన ఈ  పోటీలను ఈనెల 9న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారం చారు. మందమర్రి సింగరేణి హైస్కూల్ ​గ్రౌండ్​లో జరిగిన ఫైనల్ లో ​రాజు ఎలెవన్ టీం, నిఖిల్ ఎలెవన్​ టీం పోటీ పడ్డాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో రాజు ఎలెవన్ ​టీమ్​ విజయం సాధించింది.

పోటీల విజేతలకు మందమర్రి ఎస్సై రాజశేఖర్​, కాంగ్రెస్​ లీడర్లు పుల్లూరి లక్ష్మణ్, మంద తిరుమల్ ​రెడ్డి, గుడ్ల రమేశ్, శ్రీశైలం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండలం ప్రధాన కార్యదర్శి బి.రవికిరణ్ యాదవ్, సోషల్ మీడియా ఇన్​చార్జ్ మాయ తిరుపతి యాదవ్, లీడర్లు ఆర్.కిరణ్, సట్ల సంతోశ్, ఎర్ర రాజు, బి.శంకర్, ఆర్.​గణేశ్, ఎం.శేఖర్, వీరన్న, ఎం.శ్రీనివాస్, జావిద్, ఇషాక్, సూరజ్​తదితరులు పాల్గొన్నారు. ​