
బెల్లంపల్లి, వెలుగు : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్.. స్కూల్లో స్టూడెంట్ల ముందే మద్యం తాగిన ఉదంతమిది. బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యా యుడు రాజు కాంబ్లే గురువారం మిట్టమధ్యాహ్నం విద్యార్థుల ముందు మద్యం తాగాడు. పాఠశాలలో రోజువారీ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు సునంద గురువారం లీవ్‌లో ఉన్నారు.
ఆమె స్థానంలో ఇదే మండలం చంద్రవెల్లి గ్రామం ప్రాథమిక పాఠశా లలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజు కాంబ్లే మండల విద్యాధికారి ఆదేశాలతో సదరు పాఠశాలకు డ్యూటీపై వెళ్లాడు. మధ్యాహ్నం వేళలో విద్యార్థుల ముందే స్కూల్ఆవరణలో మరో వ్యక్తితో కలిసి మద్యం తాగాడు. ఈ ఘటనను అక్కడున్న గ్రామస్తులు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యా యుడు పాఠశాలలోనే మద్యం తాగడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ ఘటనపై మండల విద్యాధికారి పి.మహేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని, విధ్యాధికారికి నివేదించగా అతడిని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసినట్లు ఎంఈఓ తెలిపారు.