అసమ్మతి అడ్రస్ లేకుండా చేయాలి: వద్ది రాజు

పాల్వంచ, వెలుగు: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అసమ్మతికి అడ్రస్ లేకుండా చేయాలని  రాజ్యసభ ఎంసీ, కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ చార్జి వద్ది రాజు రవిచంద్ర అన్నారు. పాల్వంచలోని  ఎమ్మెల్యే వనమా నివాసంలో సోమవారం ఎమ్మెల్యే, ఆయన కుమారుడు రాఘవేంద్రతో   భేటీ  అయ్యారు. 

తొలుత  జడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, రైతు బంధు కన్వీనర్ నాగేశ్వర రావుతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ  ఆపరేషన్​  ఆకర్ష్  చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయిస్తే వనమా గెలుపు నల్లేరు మీద నడకేనన్నారు. కాంగ్రెస్​ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై  మాట్లాడుకున్నారు.