దర్శకుడు వేణు ఊడుగుల నిర్మాతగా మారి రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకుడు. మంగళవారం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘సాయిలు రాసిన కథ అట్రాక్ట్ చేసింది. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది.
వాళ్లు కూడా కథ నచ్చి ఈ మూవీని రూపొందిస్తుండటం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.