రాజు యాదవ్ రియల్ సక్సెస్ : గెటప్ శ్రీను

రాజు యాదవ్ రియల్ సక్సెస్ : గెటప్ శ్రీను

గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 24న విడుదలై పాజిటివ్ టాక్‌‌‌‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా టీమ్ ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. 

గెటప్ శ్రీను మాట్లాడుతూ  ‘ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థియేటర్స్ విజిట్‌‌‌‌కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు గుండెలు బరువెక్కాయని చెప్పడం చాలా ఎమోషనల్‌‌‌‌గా అనిపించింది. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ రియల్ సక్సెస్ అనిపించింది’ అని చెప్పాడు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌‌‌‌కి థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ అంకిత.  

డైరెక్టర్ కృష్ణమాచారి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు రాజు యాదవ్‌‌‌‌కు ఎమోషనల్‌‌‌‌గా కనెక్ట్ అవుతున్నారు. చూసిన వారంతా చాలా బావుందని చెప్పడం ఆనందంగా ఉంది’ అన్నాడు. నిర్మాత ప్రశాంత్ రెడ్డి, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.