ఏపీలో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో మళ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

ఢిల్లీ: ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. అయితే.. ఇవి అసెంబ్లీ ఎన్నికలో, లోక్ సభ ఎన్నికలో కాదు. ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు. ఆంధ్రాలో మారిన రాజకీయ పరిణామాల మూలాన మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురికీ రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ అవకాశం ఇచ్చింది.

ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీ ఏపీలో ఖాళీ అయిన 3 స్థానాలతో పాటు, ఒడిశా, హర్యానా, పశ్చిమ బెంగాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ALSO READ | ఈవీఎంలపై మరోసారి జగన్ సంచలన ట్వీట్..

* డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల
* డిసెంబర్ 10 వరకూ నామినేషన్ల స్వీకరణ
* డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన
* డిసెంబర్ 13 వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు
* డిసెంబర్ 20న రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు
* డిసెంబర్ 20నే సాయంత్రం 5 గంటలకు ఫలితాల వెల్లడి