- విచారణ పూర్తయ్యాకే కవిత అరెస్టు
- కేజ్రీవాల్ కేసును వేరుగా చూడాలి
- రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వీ
హైదరాబాద్: న్యాయ వ్యవస్థ ముందు అందరూ సమానులేనని రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింగ్వీ అన్నారు. ఇవాళ బేగంపేట్ లోని హరిత ప్లాజాలో ఆయనను కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పీఎంఎల్ఏ కేసులో కవిత అరెస్టు అంశాన్ని ప్రస్తావించారు. విచారన పూర్తయ్యాకే కవితను అరెస్టు చేశారని అన్నారు. కేజ్రీవాల్ కేసు వేరని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ముందు అంతా సమానులేనని పేర్కొన్నారు.
న్యాయవాదులు ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం న్యాయవాదులు అధికారం ఎటు వైపు ఉంటే అటు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ALSO READ : కేటీఆర్ పిటిషన్పై విచారణ వాయిదా.. 23 సాక్ష్యాలు కోర్టుకు అందజేత
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు స్టై ఫండ్, ఇండ్ల స్థలాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. హైకోర్టు కొత్త భవనం సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.