మోడీ సర్కార్ రిపోర్టు కార్డు.. అన్నింటికీ నాదే బాధ్యత

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తాజా రాజకీయ అంశాలు, ప్రజా సమస్యల గురించి ఆయన ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. మోడీ ప్రభుత్వ రిపోర్టు కార్డు అంటూ కొన్ని అంశాల్ని ప్రస్తావించిన సుబ్రహ్మణ్య స్వామి.. వాటికి తనదే బాధ్యత అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. ‘మోడీ ప్రభుత్వ రిపోర్టు కార్డు: ఎకానమీ, సరిహద్దు భద్రతలో వైఫల్యం, విదేశాంగ విధానంలో కూడా ఫెయిల్యూర్ (అఫ్గానిస్థాన్ అంశం), జాతీయ భద్రతను చూసుకుంటే పెగాసస్ డేటా లీకేజీ కుంభకోణం, అంతర్గత భద్రతా పరంగా చూసుకుంటే కశ్మీర్ చీకటిలో కూరుకుపోయింది. వీటన్నింటికీ నాదే బాధ్యత?’ అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. 

‘మరి పెట్రోల్, డీజిల్ ధరల సంగతేంటి’ అని సుబ్రహ్మణ్య స్వామిని ఓ నెటిజన్ క్వశ్చన్ చేయగా.. మోడీనే అడగండని ఆయన రిప్లయ్ ఇచ్చారు. 2014, 2019లో మోడీకి మీరు మద్దుతు ఇచ్చారు కాబట్టి ఆయన వైఫల్యానికి మీరే బాధ్యులా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి స్పందనగా.. ‘అవును మరి, మోడీ వైఫల్యానికి నాదే తప్పు. ఎందుకంటే అధికారం మొత్తం నా చేతుల్లోనే ఉంది. ఆయన దగ్గర ఏమీ లేదు’ అని సుబ్రహ్మణ్య స్వామి  వ్యంగ్యంగా బదులిచ్చారు.  కాగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన మరుసటి రోజే స్వామి ఇలాంటి ట్వీట్ చేయడం గమనార్హం. పైగా మమత బేనర్జీని పీవీ నర్సింహరావు, జయ ప్రకాష్ నారాయణ్, రాజీవ్ గాందీ, చంద్రశేఖర్ లాంటి రాజకీయ ప్రముఖులతో ఆయన పోల్చడం విశేషం.

మరిన్ని వార్తల కోసం: 

టమాటో కిలో రూ. 79కే ఇవ్వాలంటూ ప్రభుత్వ ఆదేశాలు

హుజూరాబాద్ ఓటమిని జనం మరవాలనే వరి కిరికిరి

రామాయణ్ జస్ట్ బిగిన్