- సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ అనిల్ యాదవ్ వినతి
హైదరాబాద్, వెలుగు: ప్రతి సంవతర్సం మాదిరిగానే సదర్ ఉత్సవాలు నిర్వహిస్తామని, సదర్ ను ప్రభుత్వ పండుగగా గుర్తించాలని రాజ్యసభ్య సభ్యుడు అనిల్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆదర్శ్నగర్ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ వేడుకలు నిర్వహిస్తామన్నారు.
సాయంత్రం టైంలో కాకుండా ఉదయం సదర్ జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు కనుల పండువగా నిర్వహించే సదర్ దీపావళి సందర్భంగా ఏటా జరుగుతుందని, జంట నగరాల్లో అన్ని ప్రాంతాల్లో సదర్ జరుగుతుందని చెప్పారు.