బీజేపీతోనే బీసీ ముఖ్యమంత్రి సాధ్యం : లక్ష్మణ్

హైదరాబాద్ : బీసీని ముఖ్యమంత్రి చేయడం బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. హైదరాబాద్​లోని లింగోజిగూడ డివిజన్ లో నిర్వహించిన కుమ్మరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న లక్ష్మణ్.. ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు న్యాయం జరగాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు లక్ష్మణ్. 

బీజేపీ మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేయగలదని, అందుకే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పారు. కుటుంబ పాలనకు స్వస్తి పలికి, చిన్న కులాలు కూడా పాలనలో భాగ్యసామ్యం చేసే విధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. 

ALSO READ :- ఆ క్యారెక్టర్ ఎంతో కిక్ ఇచ్చింది.. ఇక అలాంటి పాత్రలే చేస్తా!