బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య 

బీసీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య 

బషీర్​బాగ్, వెలుగు: బీసీలు రాజ్యాధికారం సాధించడమే అంతిమ లక్ష్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ నాయకుడు కోల జనార్దన్ అధ్యక్షతన శనివారం కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, టీ టీడీపీ జాతీయ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం పాల్గొని మాట్లాడారు.

జనాభా ప్రాతిపదికన బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టనున్న బీసీ బిల్లుకు అన్ని పార్టీలు పూర్తిస్థాయిలో మద్దతు పలకాలన్నారు. మన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వేముల రామకృష్ణ, నీల వెంకటేష్, తంగెళ్లముడి నందగోపాల్, ఉదయ్ నేత, సుందర్ రాజ్, వంశీకృష్ణ, వేణు, సుధాకర్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.