రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఆర్. కృష్ణయ్య

  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్

బషీర్ బాగ్, వెలుగు: బీసీల రిజర్వేషన్లు 20 శాతం నుంచి 42 శాతానికి పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని  ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కుల గణనలో బీసీల లెక్కలు తేలిన తరువాత కూడా రిజర్వేషన్లు పెంచడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు కూడా  సర్పంచులు కావాలని కలలు కంటున్నారని , బీసీలకు సర్పంచులయ్యే అవకాశం కూడా ఇవ్వరా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ తో పాటు అసెంబ్లీ లో చట్టం చేస్తే , ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు.