- గంగారం తండాలో అశ్విని కుటుంబానికి పరామర్శ
కారేపల్లి, వెలుగు: తెలంగాణ గొప్ప యువ శాస్త్రవేత్త అశ్వినిని కోల్పోయిందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. గత సెప్టెంబర్ నెలలో ఆకేరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన అశ్విని కుటుంబాన్ని గంగారం తండాలో శుక్రవారం ఆమె పరామర్శించారు. సైంటిస్ట్ అశ్విని, తండ్రి మోతిలాల్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్విని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
అశ్విని పేరును ప్రభుత్వ పథకానికి పెట్టేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిషోర్, తలారి చంద్రప్రకాశ్, బద్రు నాయక్, భూక్య భాష గడ్డం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
కామేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఆర్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కారేపల్లి మండలం వెళ్తూ ఆమె మండలంలోని తాళ్లగూడెంలో ఉన్న మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య ఇంటి వద్ద పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటివరకు ప్రజలను మోసం చేస్తూ వచ్చాయని, వారి మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జిల్లా నాయకుడు మానుకొండ రాధా కిషోర్, మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.