CJI ఇంట్లో గణపతి పూజకు ప్రధాని.. వివాదమౌతున్న మోదీ వేషధారణ

CJI ఇంట్లో గణపతి పూజకు ప్రధాని.. వివాదమౌతున్న మోదీ వేషధారణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి డీవై చంద్రచూడ్ ఢిల్లీలోని వారి నివాసంలో బుధవారం గణపతి పూజ నిర్వహించారు. ఈ పూజకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సుప్రీం కోర్టు అధికారులు కూడా హాజరైయ్యారు. పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీ మహారాష్ట్ర సంప్రదాయ దుస్తువుల్లో వెళ్లారు. మోదీకి సీజేఐ ఆయన భార్య కల్పన స్వాగతం పలికారు. అయితే మోదీ మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి ఎందుకు వెళ్లారని శివసేనా ఎంపీ సంజయ్ రౌత్ అనుమానాలు రేకిత్తించారు. అంతేకాదు శివసేనా వర్సెస్ శివసేనా కేసు విచారిస్తున్న ధర్మాసనం నుంచి CJI తప్పుకోవాలని రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఎక్స్ ద్వారా కోరారు. 

ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించాలన్న మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే శిబిరం సవాలు చేసిన కేసు నుంచి తప్పుకోవాలని సీజేఐ చంద్రచూడ్‌కు ఆయన సూచించారు. శివసేనా రెండు వర్గాలు విడిపోయిన విషయం తెలిసింది. అయితే అసలైన శివసేనా పార్టీ ఎవరిది అనే దానిపై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే మోదీ తనకు అనుకూల తీర్పు కోసమో  CJI ఇంట్లో గణపతి  పూజకు వెళ్లారని సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ సీజేఐ ఇంట్లో పూజలో పాల్గొనడం న్యాయ నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అది మన సంప్రదాయమని బీజేపీ కూడా ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తోంది. 

మా మహారాష్ట్ర కేసు సీజేఐ చంద్రచూడ్ ముందు విచారణ జరుగుతోంది, కాబట్టి ఈ కేసులో ప్రధాని మాకు వ్యతిరేకంగా ఉన్నందున న్యాయం జరుగుతుందా అనే సందేహం మాకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు నుంచి దూరంగా ఉండాలి, ఎందుకంటే అతనితో సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో సీజేఐ చంద్రచూడ్ మాకు న్యాయం చేయగలరా? రౌత్ అన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రతిపక్షాలకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్, కోల్ కతా అత్యాచార కేసులే ఇందుకు ఉదాహరణలు అని రౌత్ ఎక్స్ లో పేర్కొన్నారు.