పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి : కృష్ణయ్య

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి : కృష్ణయ్య
  • అమిత్‌ షాకు కృష్ణయ్య విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటు-లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను రాజ్యసభ ఎంపీ ఆర్‌‌.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో శుక్రవారం పార్లమెంట్‌లో ఆయన కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సమావేశమై పలు విషయాలు చర్చించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. 

కేంద్ర విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బీసీ జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రీమీ లేయర్‌ను తొలగించాలన్నారు. అలాగే, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు- చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీమ్‌లను రూపొందించాలన్నారు. 76 ఏండ్లుగా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదన్నారు.