రాజ్యసభ చాంబర్‌ను జాతీయ పుష్పం లోటస్ తరహాలో డిజైన్ చేశారు. మునుపటి రాజ్యసభ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. కొత్త రాజ్యసభలో 384 సీట్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో రాజ్యసభ సభ్యులు పెరిగినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సీటింగ్ కెపాసిటీని పెంచారు.
కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ప్రోగ్రామ్ షెడ్యూల్‌ను కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లోని లోక్‌సభ, రాజ్యసభ కాంప్లెక్స్‌కు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ శుక్రవారం తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎంట్రీ నుంచి లోపల స్పీకర్, చైర్మన్ కూర్చునే చైర్ వరకు ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చిత్రించారు.
ఉభయ సభల్లో అశోక చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మై పార్లమెంట్ మై ప్రైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి వీడియోను అందరితో పంచుకోవాలని ప్రజలను మోడీ కోరారు. వీడియోకు వాయిస్ ఓవర్ జోడించాలని, అందులో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానన్నారు.
ఇతర ప్రత్యేకతలు ఇవే..
- 15 ఎకరాల్లో త్రిభుజాకారంలో నిర్మాణం.
- పార్లమెంట్ భవనం విస్తీర్ణం: 64,500 చదరపు మీటర్లు (15 ఎకరాలు).
- డిజైన్: త్రిభుజాకారం, మూడంతస్తులు (పాత పార్లమెంట్ భవనానికి సమానంగా ఎత్తు ఉంటుంది).
- ప్రతి ఎంపీ సీటు ముందు మల్టీ మీడియా డిస్ప్లే ఉంటుంది.
- ఎంపీలకు మొత్తం సీట్లు: 1,224.
- మీడియా కోసం 530 సీట్లు.
- ద్వారాలు మూడు: జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్.
- కాన్స్టిట్యూషన్ హాల్, విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఏర్పాటు