కాంగ్రెస్ ప్రశ్నలపై ఈసీ స్పష్టతనివ్వాలి

కాంగ్రెస్ ప్రశ్నలపై ఈసీ స్పష్టతనివ్వాలి
  •  ఈవీఎంలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్

ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్పష్టతనివ్వాలని రాజ్యసభ స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఈవీఎంల దుర్వినియోగం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎం మెషీన్​లో తేడాలున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీంతో కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ ఆదివారం ఈవీఎంలపై స్పష్టత ఇవ్వాలని  కోరారు. ‘‘ఈవీఎంలపై కాంగ్రెస్ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. అవి ఏ విధంగా పనిచేస్తాయో నాకు అంతగా తెలియదు. కానీ, ఈసీ వాటిపై తప్పకుండా స్పష్టతనివ్వాలి. ఈవీఎంల దుర్వినియోగం జరుగుతున్నదని నేను భావిస్తున్నాను. అది ఎంత మేర జరుగుతున్నదో నేను కచ్చితంగా చెప్పలేను. ఈవీఎంల వినియోగానికి నేను మొదటి నుంచి వ్యతిరేకిని. నేను గతంలో వీటిపై అనేక ప్రకటనలు చేశాను. ఆపారదర్శకమైన వీటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు” అని సిబల్ వ్యాఖ్యానించారు.