Waqf Bill: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక ఆమోదం

Waqf Bill: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక ఆమోదం

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024 పై జాయింట్ యాక్షన్ కమిటీ (జేపీసీ) రూపొంచిన నివేదికను గురువారం (ఫిబ్రవరి 13) రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళన నడుమ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి  సభలో ప్రవేశపెట్టారు. అయితే  జేపీసీ రిపోర్ట్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. మైనార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని బిల్లును వ్యతిరేకించాయి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఎన్ని అభ్యంతర పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :- ప్రాథమిక హక్కుల రక్షణపై సుప్రీంకోర్టు తీర్పులు ఇవే

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఖర్గే అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సవరణ బిల్లు తెచ్చారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును బుల్డోజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.