
Rekha Jhunjhunwala: దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం నుంచి తిరిగి పునరాగమనాన్ని మెుదలుపెట్టిన వేళ అనేక స్టాక్స్ తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి. నిన్న కోల్పోయిన నష్టాలను రికవరీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు జున్‌జున్‌వాలా ఫ్యామిలీకి ఎంతగానో ఇష్టమైన షేర్లపై తమ దృష్టిని కొనసాగిస్తున్నారని తేలింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రాకేష్ జున్‌జున్‌వాలాకు ఎంతగానో ఇష్టమైన టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటాన్ స్టాక్ గురించే. సోమవారం మార్కెట్ల పతనంలో స్టాక్ తన 52 వారాల కనిష్ఠ ధర రూ.2వేల 947 స్థాయిలకు దిగజారగా.. నేడు తిరిగి లాభాల్లోకి దూసుకుపోయింది. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 6 శాతం పెరగటంతో ఒక్కో షేరు రూ.3వేల 222 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
►ALSO READ | Bull Markets: ట్రంప్ మాటలతో గ్లోబల్ మార్కెట్స్ సెట్ రైట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక్కడ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్న మరో విషయం కూడా ఉంది. అదేంటంటే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 25 శాతం వ-ృద్ధిని నమోదు చేయటమే. అలాగే ఈ త్రైమాసిక కాలంలో కంపెనీ దేశవ్యాప్తంగా 72 కొత్త టైటాన్ స్టోర్లను ఏర్పాటు చేసిందింది. దీంతో దేశంలోని రిటైల్ స్టోర్ల సంఖ్య ప్రస్తుతం 3వేల312కి చేరుకుంది. ఆభరణాల విభాగం 24 శాతం వద్ధిని చూడగా.. గోల్డ్ కాయిన్స్ అమ్మకాలు 65 శాతం, ఆభరణాల అమ్మకాలు 27 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. అలాగే ఐకేర్ కేటగిరీ 18 శాతం బలమైన వృద్ధిని చూడగా.. వాచ్ అండ్ వేరబుల్స్ వ్యాపారం 20 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇక పెర్ఫూమ్స్ అమ్మకాలు 26 శాతం పెరిగాయని వెల్లడించింది.
రేఖా జున్‌జున్‌వాలా పెట్టుబులు..
టాటాలకు చెందిన టైటాన్ కంపెనీలో రేఖా జున్‌జున్‌వాలాకు 1.08 శాతం వాటా ఉంది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీలో ఆమెకు 95లక్షల 40వేల 575 షేర్లు ఉండగా.. ఆయన భర్త దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా ఎస్టేట్ టైటాన్‌లో 3,61,72,895 షేర్లను హోల్డ్ చేస్తోందని వెల్లడైంది. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్ఐసీకి టైటాన్ కంపెనీలో ఏకంగా 2.17 శాతం భారీ హోల్డింగ్స్ ఉన్నాయని తేలింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.