బీజేపీకి రాజీనామా చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి

బీజేపీకి రాజీనామా చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి

బీజేపీకి రాజీనామా చేశారు ఏనుగుల రాకేష్ రెడ్డి.  వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టికెట్ ద‌క్కక‌ పోవ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్న ఆయన...   పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురుకున్నట్లుగా తెలిపారు.   హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మకు టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలో  పార్టీ విడుతున్నట్లుగా రాకేష్ రెడ్డి ప్రకటించారు. 

పార్టీ తనను అనేక అవమానాలకు గురి చేసినా ఏనాడూ హైకమాండ్ కు ఫిర్యాదు చేయలేదని చెప్పారు రాకేష్ రెడ్డి.  11 ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సమస్యలపై పోరాడానని అన్నారు.  పార్టీని బలోపేతం చేసిన తర్వాత తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.  బీజేపీ లో యువతకు, ప్రతిభకు ఆదరణ లేదన్నారు.  ప్రశ్నించే గొంతుకలను కోసేస్తున్నారని వాపోయారు . 

బీజేపీలో సిద్దాంతాలు లేవన్న రాకేష్ రెడ్డి.., ప్రజాబలం ఉన్న నాయకులను బలి చేస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని వచ్చే ఎన్నికల్లో 7, 8 స్థానాలు కూడా బీజేపీకి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు.  కార్యకర్తలతో చర్చించాక తాను  నిర్ణయం తీసుకుంటానని,  రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని  తెలిపారు రాకేష్ రెడ్డి.  

  •