రాఖీ ఈ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. పాకిస్తాన్‌లో కూడా హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు రాఖీ పండుగను జరుపుకుంటారు. అందుకే ఇక్కడ కూడా రక్షాబంధన్ కోసం అందమైన రాఖీలు మార్కెట్‌ల్లో సందడి చేస్తున్నాయి.దాయాది దేశం పాకిస్తాన్‌లో రాఖీలు ఉండే మార్కెట్ ఎక్కడ ఉంది.. అక్కడ ఎలాంటి ఉత్సాహవాతావరణం నెలకొందోతెలుసుకుందాం..
పాకిస్తాన్‌లో కూడా హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు రాఖీ పండుగను జరుపుకుంటారు. అందుకే ఇక్కడ కూడా రక్షాబంధన్ కోసం అందమైన రాఖీలు మార్కెట్‌ల్లో సందడి చేస్తున్నాయి. ఆగస్ట్ 19న రాఖీ పండగ నేపధ్యంలో మార్కెట్‌లలో భారీ రద్దీ నెలకొంది. ప్రస్తుతం (వార్త రాసే సమయినికి) పాకిస్తాన్ మార్కెట్లోకి రాఖీకి సంబంధించిన పలు డిజైన్లు కనువిందు చేస్తున్నాయి.
పాకిస్తాన్‌లో కూడా హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు రాఖీ పండుగను జరుపుకుంటారు. అందుకే ఇక్కడ కూడా రక్షాబంధన్ కోసం అందమైన రాఖీలు మార్కెట్‌ల్లో సందడి చేస్తున్నాయి. ఆగస్ట్ 19న రాఖీ పండగ నేపధ్యంలో మార్కెట్‌లలో భారీ రద్దీ నెలకొంది. ప్రస్తుతం (వార్త రాసే సమయినికి) పాకిస్తాన్ మార్కెట్లోకి రాఖీకి సంబంధించిన పలు డిజైన్లు కనువిందు చేస్తున్నాయి.
పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయ ప్రాంగణంలో రాఖీలతో మార్కెట్‌ను అలంకరించారు. అందమైన రాఖీలను కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడకు తరలివస్తారు. ఈ మార్కెట్‌లో రాఖీల షాపింగ్‌తో పాటు, ఫుడ్ స్టాల్స్ , పూజా వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి.
పాకిస్థాన్ లో భారతీయ రాఖీలు
పాకిస్థాన్‌లోని రాఖీ మార్కెట్ వీడియోను యూట్యూబ్ వ్లాగర్ షేర్ చేశారు. ఈ మార్కెట్‌లో భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే కుంకుమ, రాఖీ వంటి వాటిని కూడా విక్రయిస్తున్నారు. అయితే పాకిస్తాన్‌లో కూడా రాఖీలను తయారు చేసి విక్రయిస్తారు. ఈ మొత్తం మార్కెట్‌లో పండగ వాతవరణం నెలకొంది. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఇంకా ఏ దేశాల్లో రాఖీ పండుగ జరుపుకుంటున్నారంటే..
భారీ సంఖ్యలో భారతీయులు యునైటెడ్ కింగ్‌డమ్ అంటే లండన్‌లో నివసిస్తున్నారు. దీని కారణంగా రాఖీ రోజున ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తుంది. అంతేకాదు అమెరికాలో కూడా రాఖీ జరుపుకుంటారు. దీని కోసం భారతీయ దుకాణాల్లో రాఖీలను విక్రయిస్తారు. ఈ పండుగను ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో కూడా జరుపుకుంటారు. భారతదేశం పొరుగు దేశం నేపాల్ రాఖీ పండగ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.
రాఖీ పండగ రానున్న నేపధ్యంలో భారతదేశం అంతటా మార్కెట్లలో భిన్నమైన గ్లో కనిపిస్తుంది. సోదరీమణులు తమ సోదరుల కోసం అందమైన రాఖీలను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. అంతేకాదు సోదరీమణులు దూర దేశాలలో నివసిస్తున్న సోదరుల కోసం కూడా రాఖీలను పంపిస్తున్నారు.
రాఖీ పండుగ రోజున అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమానురాగాలు మాత్రమే కాదు.. సోదరభావానికి సంబంధించిన అనేక ఉదాహరణలు కూడా ఈ పండుగ సందర్భంగా వెలుగులోకి వస్తాయి. చాలా మంది ముస్లిం మహిళలు తమ హిందూ సోదరులకు రాఖీని కడతారు.. అదే విధంగా హిందూ మహిళలు తమ ముస్లిం సోదరులకు రాఖీని కడతారు. ఇది భారతదేశంలోని గంగా-జముని సంస్కృతిని తెలియజేస్తుంది.