భర్త నుంచి విడిపోయిన మరో నటి

ముంబై: బాలీవుడ్ ఐటం భామ మరో బాంబు పేల్చింది. భర్త రితేశ్ నుంచి తాను విడిపోతున్నట్లు ఆమె ప్రకటించింది. వాలెంటైన్స్ డేకి ముందు ఇలా జరగడం బాధగా ఉందని చెప్పింది. బిగ్ బాస్ షో తర్వాత పలు పరిణామాలు జరిగాయని వెల్లడించిన రాఖీ.. కలసి ఉందామనుకున్నా కుదరలేదని తెలిపింది. ‘నేను, రితేశ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను, రితేశ్ చాలా చర్చించాం. కానీ సాధ్యపడలేదు. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకున్నాం. విడిపోయి సంతోషంగా బతకాలని భావిస్తున్నాం’ అని రాఖీ సావంత్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది. 

మరిన్ని వార్తల కోసం:

శ్రీవారి భక్తులకు శుభవార్త

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు

భీమ్లా నాయక్ నుంచి కొత్త కబురు