నిమిషానికి 693 రాఖీల ఆర్డర్.. ఒక్కరోజే దిమ్మతిరిగే రేంజ్లో వ్యాపారం

నిమిషానికి 693 రాఖీల ఆర్డర్.. ఒక్కరోజే దిమ్మతిరిగే రేంజ్లో వ్యాపారం

సోదరీసోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన స్విగ్గీ ఇన్స్టామార్ట్ (Swiggy Instamart), బ్లింకిట్కు (Blinkit) కాసులు కురిపించింది. బ్లింకిట్లో నిమిషానికి 693 రాఖీలు ఆర్డర్ చేసినట్లు ఆ సంస్థ సీఈవో అల్బిందర్ ధిండా తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. భారత్తో పాటు అమెరికా, కెనడా, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

ఇక.. మన దేశంలో రాఖీ పండుగ రోజు దగ్గరదగ్గర 12 వేల కోట్ల వ్యాపారం జరిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023లో కూడా రాఖీ పండుగకు సంబంధించిన బిజినెస్ ఇండియాలో రూ.10 వేల కోట్లకు పైగానే జరిగింది. ఈ సంవత్సరం రాఖీలకు మరింత డిమాండ్ పెరిగింది. 2022లో రాఖీల వ్యాపారం రూ.7000 కోట్లు జరగ్గా, 2021లో రూ.6000 కోట్లు జరిగింది.