Thriller OTT Review: ప‌రువు హ‌త్య‌ల కాన్సెప్ట్తో.. ఓటీటీలోకి తెలుగు డ్రామా థ్రిల్ల‌ర్.. ఎక్కడ చూడాలంటే?

Thriller OTT Review: ప‌రువు హ‌త్య‌ల కాన్సెప్ట్తో.. ఓటీటీలోకి తెలుగు డ్రామా థ్రిల్ల‌ర్.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో(OTT) థ్రిల్లర్ సినిమాలు ఎపుడు బోర్ కొట్టవు. దానికి క్రైమ్ జోడిస్తే అప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందుకు మన తెలుగు నుంచి క్రైమ్ థ్రిల్లర్ వస్తుందంటే, ఆడియన్స్లో ఉండే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పుడు ఇలాంటి జోనర్ లోనే తెలుగు నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి వచ్చింది. 

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ పోతుగ‌డ్డ (Pothugadda). ఈ మూవీ నేడు గురువారం (జనవరి 30న)డైరెక్ట్ ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రక్ష వీరమ్ తెరకెక్కించిన ఈ మూవీలో పృథ్వీ, విస్మయ శ్రీ, శత్రు, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో నటించారు. ప‌రువు హ‌త్య‌ల నేప‌థ్యానికి పొలిటిక‌ల్ అంశాల‌ను జోడించి తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది? పోతుగ‌డ్డ అని పవర్ ఫుల్ టైటిల్తో ఎలాంటి వాస్త‌వ ఘ‌ట‌న‌లు చూపించారనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

కర్నూలు జిల్లాలోని పోతుగడ్డ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగుతాయి. పోతుగ‌డ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే స‌ముద్ర‌ (ఆడుకాలం న‌రేన్‌) ఉంటాడు. అతని ఈ పదవిలో పదేళ్లుగా కొనసాగుతూ ఉంటాడు. అతన్ని ఎలాగైనా ఓడించాల‌ని భాస్క‌ర్ (శ‌త్రు) నిర్ణ‌యించుకుంటాడు. అందుకు కావాల్సిన డబ్బులను ఎన్నిక‌ల ముందే కూడబెట్టడం మొదలుపెడతాడు.

అయితే, సముద్ర సైతం ఏ మాత్రం తగ్గకుండా తన ప్లానింగ్లో తాను ఉంటాడు.మహిళలు, యువత ఓట్లకు గాలం వేయడానికి కూతురు గీత (విస్మయ శ్రీ)ని పార్టీలో 'జిల్లా యూత్ ప్రెసిడెంట్' చేస్తాడు సముద్ర. కానీ, రాజకీయాలు అంటే తన కూతురు గీతకు నచ్చవు. అలా తాను ప్రేమించిన అబ్బాయితో కృష్ణ (ఫృథ్వీ దండ‌మూడి) క‌లిసి పారిపోవాల‌ని ప్లాన్ వేస్తుంది. 

ALSO READ | తండేల్ కోసం సాయి పల్లవి భారీ రెమ్యునరేషన్.. అమరన్ కంటే రూ.2కోట్లు ఎక్కువ!

అందుకు ఒకరోజు గీత, కృష్ణ ఇద్దరు కలిసి బస్సులో పారిపోతారు. ఆ విషయం సముద్రకు తెలుస్తుంది. అంతేకాకుండా అదే బస్సులో భాస్క‌ర్ తన డబ్బుని కూడా దాచిపెడతాడు. ఈ విషయం సముద్రకు ముందే తెలిసిందా? ప్రేమికులు ఇద్దరూ వెళుతున్న అదే బస్సులో ఎలాంటి ప్రయాణం చేయాల్సి వచ్చింది?

ఆ బ‌స్‌లోనే భాస్క‌ర్ డ‌బ్బు ఎందుకు ఉంది? కూతురి ప్రేమ విష‌యం తెలుసుకున్న సముద్ర ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరికి ప్రేమికులు ఏం అయ్యారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే పోతుగడ్డ చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

ఒక చక్కని ప్రేమ కథతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఎన్నికల్లో ప్రత్యర్దులపైనా గెలవడానికి ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తారనేది చక్కగా చూపించారు.

తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి, ఊరు విడిచి వెళ్లిపోదామని బస్సులో బయల్దేరిన జంటకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో బాగా చూపించాడు. వాళ్లను ఒక గ్యాంగ్ వెంటాడం, మరో గ్యాంగ్ ఆ బస్సులో ఉన్న రూ.50 కోట్లను అక్రమంగా తరలించడం, ఒక వైపు నుంచి రాజకీయ నాయకుడు.. మరోవైపు పోలీసులు.. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సును టార్గెట్ చేస్తూ కథ సాగడం ఆసక్తిగా ఉంది.

అయితే, కొంతమంది ఆడియన్స్ కి సరిపడే థ్రిల్లింగ్ అంశాలు ఇందులో లేవు. ఫ్యాక్షన్ కక్షలు లేకపోయినా సరే ఎత్తుకు పైఎత్తు వంటివి ఉంటాయని అనుకుంటే.. అవేవీ లేకుండా సాదాసీదాగా నత్త నడకన సినిమా ముందుకు సాగుతుంది. మాటల్లో తప్ప తెరపై పాత్రల్లో గానీ, సన్నివేశాల్లో గానీ ఎమోషన్ వర్కవుట్ కాలేదు.