
కన్నడ స్టార్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షస’. హెచ్ లోహిత్ దర్శకుడు. ఎంవీఆర్ కృష్ణ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 28న సినిమా విడుదల కావలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో వారం రోజులపాటు వాయిదా వేశారు. మార్చి 7న కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ‘బెటర్ ఔట్ పుట్ కోసం వారం రోజులు పాటు వాయిదా వేశామని, టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని ఎంవీఆర్ కృష్ణ తెలియజేశారు. అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.