సప్త సాగరాలు దాటి సైడ్ బి.. ఒకే టీజర్ లో 4 భాషలు.. కటింగ్ అదిరిపోయింది

భారీ సినిమాలు, అదిరిపోయే కలెక్షన్స్.. మాట వినబడితే..బాలీవుడ్ అనే రోజులు పోయాయి. తెలుగు సినిమాల సత్తా ఇంటర్నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ తోను, భారీ నిర్మాణంతోనూ దూసుకెళ్లాయి. అలాగే కన్నడ సినిమాలు కూడా కె.జి.యఫ్ మూవీతో మొదలై..చిన్న సినిమాల వరకు వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తున్నాయి. 

రీసెంట్ గా కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం సప్త సాగరాలు ఎల్లో (సైడ్ ఏ). అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి (Sapta Sagaralu Dhaati ) పేరుతో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీకి తెలుగులో ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. .ఇప్పుడు ఈ సినిమాకు సప్త సాగరాలు దాటి సైడ్‌ బి సీక్వెల్‌ రాబోతుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీ నుంచి తెలుగు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో చూపించిన ఎమోషనల్ సోల్​ను ఎక్కడా మిస్ చేయకుండా డైరెక్టర్ క్యారీ చేసినట్టు టీజర్ లోనే కనిపిస్తోంది. రాత్రి పూట రక్షిత్ శెట్టి ఓ బిల్డింగ్​పై పడుకున్న సీన్​తో ప్రారంభమై..తన ప్రేయసి చెప్పే మాటలు వింటున్నట్టుగా..తనతో డైరెక్ట్ మాట్లాడినట్టుగా..డిజైన్ చేసిన సీక్వెన్స్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

Also Read :- ఇండియన్2 మూవీ నుండి బిగ్ అప్డేట్

అలాగే ఈ టీజర్​లోనే తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో డైలాగ్స్ వినిపించడం ఆడియన్స్ కు ఇంట్రెస్టింగ్​గా ఫీల్ ఇస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్యూర్ సోల్ ను క్యారీ చేసింది. ఈ టీజర్ తో సెకండ్ పార్ట్ సైడ్ బి మంచి ప్రామిసింగ్ ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తోంది.

సప్త సాగరాలు దాటి (సైడ్ బి) (SaptaSagaraaluDhaati SideB) సీక్వెల్ వచ్చే నెల నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సారి కన్నడ తో పాటు తెలుగు, తమిళ్..ఇతర భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 

  • Beta
Beta feature