PM Narendra Modi: రకుల్‌-భగ్నానీ జంటకు..ప్రధాని మోదీ స్పెషల్ విషెష్

PM Narendra Modi: రకుల్‌-భగ్నానీ జంటకు..ప్రధాని మోదీ స్పెషల్ విషెష్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth singh) బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ (Jocky Bhgnani)  (ఫిబ్రవరి 21న) వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గోవాలోని ITC గ్రాండ్ సౌత్ రిసార్ట్స్‌లో వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్కి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.  

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈ కొత్త జంటకు స్పెషల్ విషెష్ తెలిపారు.“ఎల్లవేళలా ఒకరికొకరు ప్రక్కన ఉంటూ, తమ కలలను, ఆకాంక్షలను సాకారం చేసుకోవాలనే తపనతో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, ఆలోచనాత్మకంగా, ఆప్యాయంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఒకరి లోపాలను ఒకరు అంగీకరించి జీవిత ప్రయాణంలో పరిపూర్ణ భాగస్వాములు కావాలని మోదీ తెలిపారు. ఒకరి సద్గుణాల నుండి మరొకరు నేర్చుకోవడం చాలా ముఖ్యం అన్నారు. వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మహత్తర సందర్భానికి మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అంటూ మోదీ కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. 

రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని మోదీ తెలిపిన విషయాన్ని పంచుకున్నారు." చాలా గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జీ..మీ శుభాకాంక్షలు మాకు చాలా అర్ధాన్ని తెలియజేశాయి. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు' అని రకుల్ పోస్ట్ చేసింది.

అయితే..నరేంద్ర మోదీ పిలుపుతో రకుల్ వెడ్డింగ్ గోవాలో జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ ల‌క్ష్యద్వీప్ ప‌ర్యట‌న‌కు వెళ్లి.. డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌నుకునే వారు వేరే దేశాల‌కు వెళ్లకుండా మ‌న దేశంలోనే మంచి ప‌ర్యాట‌క ప్రదేశాల‌ను సెల‌క్ట్ చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. దీనికి దేశ‌వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక‌పై వెకేష‌న్కు స్వదేశంలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే వెళ్తామని పలువురు సెలబ్రెటీలు చెప్పారు. ఈ క్రమంలోనే ర‌కుల్ జాకీ జంట తమ పెళ్లి వేదికను గోవాకి షిఫ్ట్ అయినట్లు సమాచారం.