టాలీవుడ్ ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్(Rakul preet singh) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇక అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.
Also Read : సముద్రంలో హారర్ అడ్వంచర్స్
ఈ సందర్భంగా ఆమె బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీ(Jackky bhgnani) కూడా ఆమెకు స్పెషల్ విషెస్ తెలిపాడు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ వీడియోతో పాటు ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు.. ఈ ప్రత్యేకమైన రోజున నన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మీతో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ అలుపన్నది రాదు. మీరే నా ధైర్యం. నా ప్రతి అడుగులో మీరే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషాలతో నింపే వ్యక్తి మీరే. ఈ ప్రత్యేకమైన రోజున మీరు కలలుకన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రతి రోజును ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ రాసుకొచ్చాడు జాకీ భగ్నానీ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.