ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలతో బాగా బిజీ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. సౌత్‌లో ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేస్తోంది. కానీ బాలీవుడ్లో చేతినిండా సినిమాలే. వాటిలో మొదటగా ‘అటాక్’ రిలీజవుతోంది. ఏప్రిల్ 1న రానున్న ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉంది రకుల్. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఇప్పుడు తాను ఉన్న పొజిషన్ తనకి చాలా సంతోషాన్ని కలిగిస్తోందని చెబుతోంది. అవును మరి. ఒకటీ రెండూ కాదు.. ఈ సంవత్సరం ఆమె నటించిన ఆరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘ప్యాండమిక్ వల్ల సినిమాలన్నీ ఆలస్యమయ్యాయి. అయితేనేం.. ఎట్టకేలకి వాటిని పూర్తి చేశాను. వరుసగా ఆరు సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలా ఎక్సయిటింగ్‌గా అనిపిస్తోంది’ అంది రకుల్. ఇన్ని సినిమాలు చేస్తున్నా, మంచి కాన్సెప్ట్ దొరికితే ఓటీటీలోనూ అడుగు పెడతానంటోంది రకుల్. ‘థియేటర్లు, సినిమాలు లేనప్పుడు ఓటీటీలు ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ని అందించాయి. దానివల్ల రకరకాల కంటెంట్ ఆడియెన్స్‌ని రీచ్ అయ్యింది. వాళ్లు కొత్త కంటెంట్‌ని ఆదరిస్తున్నారు. నేను కూడా ఆ కొత్తదనాన్ని కోరుకుంటున్నాను. మంచి సబ్జెక్ట్ అయితే చాలు.. ఓటీటీకి పని చేయడానికి కూడా నేను సిద్ధమే’ అని చెప్పింది రకుల్. ఆల్రెడీ కాజల్, తమన్నా, సమంత లాంటి వారంతా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక రకుల్ కోరిక తీరడమే మిగిలింది.
కొత్తదనం కావాలి
- టాకీస్
- March 28, 2022
మరిన్ని వార్తలు
-
విశాల్ ఫైర్: ఇళయరాజాపై దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్టి క్షమాపణ చెప్తే సరిపోతుందా?
-
Pushpa 2 OTT: ఓటీటీలోకి అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
-
Haripriya: పెళ్లిరోజునే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ హరిప్రియ
-
Allu Arjun: బాలకృష్ణకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏం చెప్పారంటే?
లేటెస్ట్
- పరిగిలో సిత్రం.. 6 తులాల బంగారం దోచుకెళ్లారు.. 12 తులాల వెండి, 12 వేల డబ్బు జోలికి మాత్రం పోలేదు..!
- విజయి సాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
- Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..
- కంగ్రాట్యులేషన్స్ మై డియర్ ఫ్రెండ్.. ట్రంప్‌కు ప్రధాని మోడీ ఫోన్
- కిడ్నాప్ చేసి రూ.6 కోట్లు డిమాండ్ చేసినోళ్లు బస్ ఛార్జీలకు రూ.300 ఇచ్చి విడిచిపెట్టారు..!
- Good Health : ఫ్రూట్స్ ను ఎలా శుభ్రం చేసుకోవాలి.. ఇలా చేయకపోతే ఎన్ని అనారోగ్యాలో తెలుసా..!
- Bank Holidays: ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా ఈ తేదీల్లో బ్యాంకులు బంద్
- IND vs ENG: టీమిండియాతో మూడో టీ20.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్
- నీ పనే బెటర్ గా ఉందిగా : దర్గా దగ్గర బిచ్చగాడు.. లక్షన్నర పెట్టి ఐఫోన్ కొన్నాడు
- కేటీఆర్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ: మంత్రి సీతక్క
Most Read News
- గుడ్ న్యూస్: రేపు( జనవరి 28) స్కూళ్లకు హాలిడే..ఎందుకంటే?
- అమీన్పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు
- బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.. మీ అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్
- శివయ్యను దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే..
- ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలి
- Daaku Maharaj Box Office: బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు.. పెరిగిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
- ఐటీ కంపెనీ ఎదుట నిరుద్యోగుల పరేడ్.. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు 3 వేల మంది..!
- రఘురామకు షాక్.. జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు..
- Daaku Maharaaj OTT: ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ డ్రామా డాకు మహారాజ్.. స్ట్రీమింగ్కు అప్పుడేనా?
- ఆర్టీసీ సమ్మె నోటీస్: ఆ రోజు నుంచి బంద్ అంటూ అల్టిమేటం