అదిరిపోయే స్టెప్పులేసిన రకుల్,మంచు లక్ష్మి

బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్,బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటుంది. తాజాగా రకుల్ ఓ డాన్స్ విడియోను షేర్ చేసింది. అందులో రకుల్ మంచు లక్ష్మితో కలిసి సరదాగా స్టెప్పులేసింది. బాలీవుడ్ వరుణ్ దావన్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్ జిగ్ జియో.. ఈ సినిమాలోని "ది పంజాబ్బన్" పాటకు వీరిద్దరూ డ్యాన్స్ తో దుమ్ములేపారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. వరుణ్ దావన్ ఇచ్చిన ఈ సాంగ్ ఛాలెంజ్ కు ఇప్పటికే పలువురు స్టార్ చిందులేశారు. 

ఇక మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ ఎంతో కాలంనుండి మంచి స్నేహితులు. వీరు అప్పుడుప్పుడు కలుసుకొని సరదాగా గడుపుతుంటారు. ఇలా కలిసిన ఓ సందర్భంలో ఈ వీడియో తీసుకున్నారు.కాగా, వీరి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. రకుల్ ప్రస్తుతం బా 'డాక్టర్ జీ', 'థ్యాంక్ గాడ్','అయలాన్','ఛత్రివాలీ' తదితర సినిమాల్లో నటిస్తోంది.మరోవైపు, మంచు లక్ష్మి 'లేచింది మహిళా లోకం' సినిమాలో నటిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)