ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండానే తీసేశారు: రకుల్ ప్రీత్ సింగ్

ప్రభాస్ సినిమా నుంచి చెప్పకుండానే తీసేశారు: రకుల్ ప్రీత్ సింగ్

కొంతమంది నటీనటులకు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ పలు అనివార్య కారణాలవల్ల సినిమాలు క్యాన్సిల్ అవ్వడం లేదా వారి స్థానంలో ఇతరరులను తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంది. ఈ విషయంపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. 

అయితే గతంలో తనకి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఈ క్రమంలో 4 రోజులపాటు షూటింగ్ లో కూడా పాల్గొందట. ఆ తర్వాత తన షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో తన మరో సినిమా షూటింగ్ నిమిత్తమై ఢిల్లీ కి వెళ్లివచ్చేసరికి తనని ఈ చిత్రం నుంచి తప్పించినట్లు తెలిసిందని చెప్పుకొచ్చింది. 

అయితే తనని ప్రభాస్ చిత్రం నుంచి తప్పించినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది. ఆ తర్వాత మరో ప్రముఖ తెలుగు హీరో చిత్రంలో నటించేటప్పుడు కూడా ఇదే జరిగిందని దాంతో సినిమాలకి సైన్ చేసేముందు ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ కెరీర్ లో ముందుకు సాగానని తెలిపింది.