డ్రగ్స్ కేసు..A6 గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. ఇప్పటికే కేసులో దొరిని నిందితులందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీళ్ళ నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. 13 మందికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. 

పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారని అన్నారు. అమన్ తోపాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన పెడ్లర్ల లో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ కూడా ఉన్నారని వెల్లడించారు. 

Also Read : నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. యువజంట ఆత్మహత్య

 కేసులో A1 గా అనౌహా బ్లెస్సింగ్, A2 గా అజీజ్ నోహిమ్, A3 గా అల్లం సత్య నారాయణ, A4 సనబోయిన వరుణ్, A5 గా మహబూబ్ షరీఫ్, A6 గా రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ చేర్చారు పోలీసులు.