
పద్మారావునగర్, వెలుగు: జమ్మూ కాశ్మీర్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ విభాగం, జుడా, టి.ఎన్.జి.ఓ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ హాస్పిటల్లో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
టెర్రరిస్టుల దాడిలో టూరిస్టులు, విదేశీయులు చనిపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం సీరియస్యాక్షన్తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ భూపేందర్ రాథోడ్ విజ్ఞప్తి చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, ప్రిన్సిపాల్ కత్తుల ఇందిర, సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.