బంగ్లాదేశ్‌‌‌‌లోని హిందువులను కాపాడండి.. అమెరికాలో భారతీయుల ర్యాలీలు

బంగ్లాదేశ్‌‌‌‌లోని హిందువులను కాపాడండి.. అమెరికాలో భారతీయుల ర్యాలీలు

వాషింగ్టన్: బంగ్లాదేశ్‌‌‌‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రెండు రోజులపాటు వాషింగ్టన్, షికాగోలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు భారత సంతతి అమెరికన్లు వెల్లడించారు. హిందూ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం  చికాగోలో, సోమవారం వైట్‌‌‌‌హౌస్ ఎదుట శాంతియుత ర్యాలీతో నిరసన తెలియజేస్తామన్నారు. ఈ మేరకు హిందూయాక్షన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ ఉత్సవ్ చక్రవర్తి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌‌‌‌లోని హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్​ను డిమాండ్ చేశారు.