క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/ కామేపల్లి/ జూలూరుపాడు, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​కలెక్టర్​డి. వేణుగోపాల్​ అన్నారు. వరల్డ్​ టీబీ నివారణ డే సందర్భంగా కొత్తగూడెంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. టీబీని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ప్రజలు సహకరించాలన్నారు. అన్ని గవర్నమెంట్​ హాస్పిటళ్లలో టీబీకి అన్ని రకాల పరీక్షలతో పాటు మందులను ఉచితంగా ఇస్తారన్నారు.

 ప్రోగ్రాంలో డీఎంహెచ్‌‌వో భాస్కర్​నాయక్​, డాక్టర్​ బాలాజీ, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ములకలపల్లి మండలకేంద్రంలో మంగపేట పీహెచ్‌‌సీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కామేపల్లి మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ స్కూల్‌‌లో వైద్యాధికారులు చందన, శిరీష పిల్లలకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. జూలూరుపాడు మండలకేంద్రంలో మెడికల్​ ఆఫీసర్​వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

ఖమ్మం కార్పొరేషన్: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి సూచించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయవ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరికూటి సుబ్బారావు క్షయవ్యాధి లక్షణాల గురించి వివరించారు. 2 వారాలకు మించి దగ్గు, రాత్రి పూట చమటలు పట్టడం, ఆకలి మందగించటం వంటి లక్షణాలుంటే క్షయ వ్యాధి ఉన్నట్టని చెప్పారు. 

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం వద్ద ఉచితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ తర్వాత ఆశ కార్యకర్తల ద్వారా నేరుగా ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తామని తెలిపారు. అంతేకాకుండా పోషకాహార నిమిత్తం ప్రతినెలా రూ.వెయ్యి క్షయవ్యాధిగ్రస్తుల బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్​డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్లు బాబు రత్నాకర్, కిరణ్, నర్సింగ్ విద్యార్థినులు 
పాల్గొన్నారు.