రాష్ట్రంలో వెంటనే హోంమంత్రిని నియమించాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో వెంటనే హోంమంత్రిని నియమించాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార హత్య ఘటనపై ప్రభుత్వం చొరవచూపి  కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు  కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఆ ఘోరానికి పాల్పడ్డ వాడిని రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉరి శిక్ష విధించాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పాప చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరం ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రలో పోలీస్ వ్యవస్థ సారిగా పని చేయడం ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరగా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.