ప్రోమో రిలీజ్.. అన్‏స్టాపబుల్ షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..

 ప్రోమో రిలీజ్..  అన్‏స్టాపబుల్  షోలో డాకు మహారాజ్ తో గేమ్ ఛేంజర్..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే" షోకి గెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశాడు. దీంతో మేకర్స్ ఆదివారం (జనవరి 05) ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 

అయితే ప్రోమోలో రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ స్టార్ అంటూ బాలయ్య ప్రశంసలు కురిపించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కార గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఉదయం సమయంలో కచ్చితంగా 2 గంటలపాటు క్లిన్ కారతో గడుపుతానని అన్నం తినిపిస్తూ ఆలనా, పాలనా చూసుకుంటూ అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బాలయ్య ఇంట్లో ఆడపిల్ల పుడితే అమ్మవారు పుట్టినట్లే అని చెప్పే మాటలు మొత్తం ప్రోమోకే హైలెట్ గా నిలిచాయి. ఇక క్లిన్ కార తనని ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో ఆరోజే క్లిన్ కార ని అందరికీ చూపిస్తానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఆ ఆతర్వాత రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్, గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఈ షోకి వచ్చి సందడి చేశారు. ఇందులో నిర్మాత దిల్ రాజు జనవరి 10, 12, 14 తేదీల్లో వరుస సినిమాలు ఉన్నాయని ఆ తర్వాత పార్టీ చేసుకుందామని బాలయ్య ని అడగ్గా వెన్తనె ఒకే చెప్పాడు. అలాగే ఈ పార్టీకి బాలయ్య ఒక్కడినే రానని 10 మందితో కలసి వస్తానని చెప్పగా దిల్ రాజు ఎంతమంది వచ్చినాసరే అన్ని ఏర్పాట్లు చేస్తానని, అలాగే ఆరోజు బాలయ్య పాటలకి డ్యాన్స్ చేస్తానని చెబుతూ అందరినీ నవ్వించాడు. 

Also Read :- డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్

ఇక చివర్లో బాలకృష్ణ ప్రభాస్ కి కాల్ చేశాడు. దీంతో ప్రభాస్ మీరు నాకు కాల్ చేశారంటే చరణ్ టెన్షన్ పట్టుకుంటుందని చెబుతూ ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి రామ్ చరణ్ పర్సనల్, ఫ్యామిలీ విషయాలు, డార్లింగ్ ప్రభాస్ ఫోన్ కాల్, ఇలా ఆసక్తికరంగా సాగింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం మెగా బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తన్నారు.