RC16 Tittle and First Look Update: చేతిలో బీడీ.. కర్లీ హెయిర్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేశాడా..?

RC16 Tittle and First Look Update: చేతిలో బీడీ.. కర్లీ హెయిర్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేశాడా..?

రామ్ చరణ్ RC16 నుంచి క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. రేపు (మార్చి 27న) రామ్ చరణ్ బర్త్ డే ఉండటంతో మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ రివీల్ అయింది. రేపు ఉదయం 9.09 నిమిషాలకు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో పాటూ RC16 టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే RC16 టైటిల్ ఏమైయి ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తునారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్ తో మూవీ రాబోతుంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుందని టాక్. ఈ విషయంపై రేపు క్లారిటీ రానుంది.

ALSO READ | ఇంకెందుకు లేటు అంటూ.. చిరు సినిమా అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kappoor) హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మిర్జాపూర్ వెబ్ సీరీస్ ఫేమ్ దివ్యేందు తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman) సంగీతం అందిస్తున్నారు.

దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.