RC16PoojaCeremony: గ్రాండ్గా ప్రారంభమైన RC16..బుచ్చిబాబు మార్క్ టైటిల్!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi Babu Sana)తో రామ్ చరణ్ (RC 16) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా బుధవారం (మార్చి 20న) పూజా కార్యక్రమం (RC16PoojaCeremon) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ స్పెషల్ ఈవెంట్ లో మెగాస్టార్, చిరు, శంకర్, బుచ్చిబాబు, చరణ్,జాన్వీ, ఏఆర్ రెహమాన్, మైత్రి మేకర్స్ నిర్మాతలు సహా పలువురు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా లెవల్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు పెద్ది (Peddi) అనే టైటిల్ ను ఖరారు చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ముసలివారిని,పెద్దవారిని 'మా పెద్ది' అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. పెద్ది అనే టైటిల్..బుచ్చిబాబు కథకి తగ్గట్టుగా సెట్ చేసినట్లు వినిపిస్తోంది. అయితే ఇవాళ టైటిల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

RC16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా..రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్..నిర్మాణంలో సినిమాను నిర్మించనున్నారు