![అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేస్తున్న మెగా హీరోలు.. విభేదాలు నిజమేనా..?](https://static.v6velugu.com/uploads/2025/02/ram-charan-and-dhruv-tej-unfollow-the-allu-arjun-in-instagram_bqpavwP5fC.jpg)
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాగా క్లిక్ అయ్యారు. అయితే రామ్ చరణ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని ఏకంగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు.
అయితే ఈ మధ్య మెగా కాంపౌండ్ లోని హీరోల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో హీరోల సినిమాలు రిలీజ్ సమయంలో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, విష్ చేసుకోవడం వంటివి జరగడంలేదు. తాజాగా రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాడు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
మెగా కుటుంబం నుండి వచ్చిన మరో నటుడు ధ్రువ తేజ్ కూడా అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశాడు. ఇప్పుడు వారిమధ్య ఏదైనా సమస్య ఉందా అని చాలామంది అడుగుతున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం కేవలం తన సతీమణి అల్లు స్నేహా రెడ్డిని తప్ప ఇతరులని ఫాలో కావడం లేదు. దీంతో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి.
ALSO READ | చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్, రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇందులో పుష్ప 2: ది రూల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అంతేకాదు వరల్డ్ వైడ్ దాదాపుగా రూ.2200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కానీ గేమ్ ఛేంజర్ మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో అప్పటినుంచి ఈగో విషయంలో విభేదాలు మొదలయ్యాయని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే రామ్ చరణ్ మరియు అల్లు అరవింద్ మధ్యన కూడా విభేదాలు ఉన్నాయని పలు రూమర్స్ వినిపించాయి. దీంతో ఆమధ్య జరిగిన ఓ ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకి కొడుకులాంటి వాడని, ఏకైక మేనల్లుడని తమ మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని క్లారిటీ ఇచ్చాడు. మరి ఇపుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయని వినిపిస్తున్న వార్తలపై ఈ ఇద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.