Ram Charan: స్పీడ్ పెంచిన గ్లోబల్ స్టార్.. ఢిల్లీ పార్లమెంట్కు రామ్ చరణ్!

Ram Charan: స్పీడ్ పెంచిన గ్లోబల్ స్టార్.. ఢిల్లీ పార్లమెంట్కు రామ్ చరణ్!

రామ్ చరణ్,బుచ్చి బాబు కలయికలో వస్తోన్న RC 16 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వరుసగా రెండు కీలక షెడ్యూల్ను పూర్తిచేసుకుని, నెక్స్ట్ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుంది. 2024 ఏడాది చివర్లో ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలోని మైసూరులో జరగగా, సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో జరుపుకుంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. RC 16 మూడో షెడ్యూల్ షూటింగ్ ఢిల్లీలో జరగనుందని సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్, జామా మసీదు వంటి ప్రసిద్ధ ప్రదేశాలలో కొన్ని కీలకమైన సీన్స్ను తీయబోతున్నారట దర్శకుడు బుచ్చిబాబు.

ఇప్పటికే షూటింగ్కి అవసరమైన అనుమతుల కోసం నిర్మాణ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అవి సంబంధిత అధికారుల నుండి ఆమోదం కోసం వేచి ఉన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

అయితే, అన్నీ టైంకి సెట్ అయితే, ఇవాళ (మార్చి 4న) పార్లమెంట్‌లో షూటింగ్ ప్రారంభిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రంజాన్ పండుగ కావడంతో, జామా మసీదులో షూటింగ్ మార్చి చివరి వరకు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది.

ALSO READ : Sivaji Ganesan House: నటుడు శివాజీ గణేషన్ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని చెన్నై హైకోర్టు ఆదేశం

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ 'ఆల్ ది బెస్ట్ అన్న.. ఈ సారి గట్టి సక్సెస్ వస్తోంది' అంటూ సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

పీరియాడికల్‌‌ బ్యాక్‌‌ డ్రాప్‌‌ స్పోర్ట్స్‌‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌‌చరణ్‌‌ క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వి కపూర్ నటిస్తోంది. ఇది జాన్వీకి తెలుగులో రెండవ ప్రాజెక్ట్.

ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, మీర్జాపూర్ ఫేమ్ శివ రాజ్ కుమార్ మరియు దివ్యేందు కీలకపాత్రలు పోషిస్తున్నారు.