Dhop Song: జోష్ పెంచుతున్న గేమ్ ఛేంజర్.. .'దోప్‌'‌ ‌అంటే అర్థం తెలుసా!

Dhop Song: జోష్ పెంచుతున్న గేమ్ ఛేంజర్.. .'దోప్‌'‌ ‌అంటే అర్థం తెలుసా!

రామ్ చరణ్​ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్‌‌‌‌’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్​లో  వేగం పెంచిన మేకర్స్‌‌.. బుధవారం(Dec18) ‘దోప్‌‌’ అనే సాంగ్‌‌ అప్‌‌డేట్ ఇస్తూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పాటను తమన్ కంపోజ్ చేయడంతో పాటు జేకేవీ రోషిణి, పృథ్వి శ్రుతి రంజనితో కలిసి పాడాడు.

‘వాక్క వాక వాక వాట్ సే దోప్.. లాక్క లక లక లెట్స్ సే దోప్.. హ్యాపీ హ్యాపీ లైఫ్‌‌కు మైక్రో మంత్ర దోప్’ అనే పల్లవితో సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి  లిరిక్స్ రాశారు. బెంగాలీలో ‘దోప్’ అంటే అబద్ధం అనే అర్థం ఉంది.  డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు అమెరికాలోని డల్లాస్‌‌లో (ఇండియాలో 22న ఉదయం 8.30కు) ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు  భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ఎస్‌‌ జే సూర్య,  జ‌‌యరామ్‌‌, అంజ‌‌లి, సునీల్, శ్రీకాంత్‌‌, న‌‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.