Game Changer: ఒకే ఒక్కడును మించేలా గేమ్ ఛేంజర్.. అంచనాలు పెంచిన మేకర్స్ స్పీచ్

Game Changer: ఒకే ఒక్కడును మించేలా గేమ్ ఛేంజర్.. అంచనాలు పెంచిన మేకర్స్ స్పీచ్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. గురువారం (JAN 2న) ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘శంకర్ గారు అంటే  తెలుగు వారందరికీ గౌరవం. ప్రస్తుత యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం. ఆయన డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని కాన్ఫిడెంట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ఈ ట్రైలర్‌‌ రిలీజ్ చేసే చాన్స్ నాకు ఇచ్చినందుకు ధ్యాంక్స్. ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారిని చూస్తాం.

‘ఒకే ఒక్కడు’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ఆ స్థాయిని మించేలా ‘గేమ్ చేంజర్’ ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ప్రతీ షాట్, సీన్‌‌ ఎక్సయిట్‌‌మెంట్ ఇచ్చింది. రామ్ చరణ్‌‌ హెలికాప్టర్ నుంచి లుంగీతో కత్తి పట్టుకుని దిగుతుంటే.. థియేటర్స్‌‌లో ఎలా విజిల్స్ పడతాయో తెలుస్తోంది’ అని చెప్పారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ ‘రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు.  అందరి పెర్ఫార్మెన్స్‌‌లతో ఈ సినిమా ఎలివేట్ అవుతుంది’ అని అన్నాడు.

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘సోషల్, కమర్షియల్, మాస్, ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రం ఉంటుంది.  పొలిటికల్ లీడర్,  ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ.  హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రామ్ చరణ్  అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. అంతలా రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు’ అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ ‘శంకర్ గారు, రాజమౌళి గారి  వల్లే  ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. ట్రైలర్‌‌లో చూసింది కొంతే.. సినిమా అన్ ప్రిడిక్టబుల్‌‌గా ఉంటుంది’ అని అన్నారు. నటులు శ్రీకాంత్, సముద్రఖని, ఎస్‌‌జే సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రైటర్ సాయి మాధవ్ బుర్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.