Game Changer X Review: గేమ్ ఛేంజ‌ర్ X రివ్యూ.. రామ్‌చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?

గ్లోబల్ స్టార్ రామ్‍ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). విజనరీ డైరెక్టర్ శంకర్ (Shankar)  నేడు శుక్రవారం (జనవరి 10న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకొచ్చింది.

పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.  ఎస్.జె సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉంది? డైరెక్టర్ శంకర్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అనేది X రివ్యూలో చూద్దాం.  

ఈ పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్లర్ లో సామజిక అంశాల‌తో పాటు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. దర్శకుడు శంక‌ర్ తనదైన శైలిలో రూపొందించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇదని నెటిజ‌న్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్ప‌న్న‌గా, ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టేశాడ‌ని X లో కామెంట్స్ పెడుతున్నారు.

ఫ‌స్ట్ హాఫ్‌లో చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్‌తో పాటు ధూప్ సాంగ్‌, బీజీఎమ్‌, ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌ నిలిచాయని అంటున్నారు.  సెకండాఫ్‌లో ఫ్యాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో పాటు అప్పన్న ఎమోషన్స్ సీన్స్ వేరే లెవెల్ అని.. శంక‌ర్ స్టైల్ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, రేసీ స్క్రీన్‌ప్లేతో గేమ్ ఛేంజ‌ర్ అద్దిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్‌ శంకర్ కి ఇది సాలిడ్ క‌మ్‌బ్యాక్ మూవీ అవుతుందని.. చరణ్ కెరీర్లో బెస్ట్ ఇచ్చాడని.. సంక్రాంతికి గేమ్ ఛేంజ‌ర్ బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని X లో వినిపిస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతికి సరైన విందు. సెకండాఫ్ లో రామ్ చరణ్ నటన శిఖరాలు దాటింది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచింది. అప్పన్న, పార్వతి పాత్రలను శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 20-25 నిమిషాలు బలమైన భావోద్వేగాలతో గుండె బరువెక్కించాడు. రామ్ చరణ్ అప్పన్నగా,అంజలి పార్వతి పాత్రలో జీవించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. నిర్మాత దిల్ రాజు సాంగ్స్ మేకింగ్ కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా నిర్మాణ విలువను ప్రతి షాట్‌లో చూపిస్తుంది. ఎస్ జే సూర్య నటన మోపిదేవి పాత్రలో సినిమాకు మరో బాలం. ఆఫీసర్ రామ్ & మంత్రి మోపిదేవి ఇరగదీశారని ఓ నెటిజన్ X రివ్యూలో తన రివ్యూను పంచుకున్నాడు. 

#GameChanger A Perfect Feast for Sankranti -

RAM Charan 's Performance PEAKS in Second Half flashback Portion & The Flash Back Portion is the backbone of Second Half ( Appanna & Parvathi Charecter - Excellent portrayal ) That 20 - 25 Mins 🔥🔥 Shankar's portrayal Make a… pic.twitter.com/d1yDTm3kYI

— Let's X OTT GLOBAL (@LetsXOtt) January 9, 2025

గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ అండ్ రామ్ చరణ్ కి కెరీర్ ఛేంజర్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఈ సినిమాతో శంకర్ గ్రేట్ కమ్ బ్యాక్ అని చెప్పుకోవాలి. స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ ఫెర్ఫార్మెన్స్, టాప్ ఫెర్ఫార్మెన్స్, అద్బుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్‌ మూవీకి అదనపు ఆకర్షణ. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంది. విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కియారా అద్వానీ, అంజలి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Game Changer: ⭐️⭐️⭐️⭐️

CAREER CHANGER

Shankar has given a comeback with remarkable film that blends engaging storytelling, stellar performances, and top-notch technical elements to create an immersive cinematic experience. He masterfully handled the transitions between… pic.twitter.com/KExTTKuxrJ

— Manobala Vijayabalan (@ManobalaV) January 9, 2025

గేమ్ ఛేంజర్ స్ట్రిక్ట్లీ యావరేజ్ ఫస్ట్ హాఫ్ అని.. ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్‌తో పాటు కొన్ని IAS బ్లాక్‌లు అద్దిరిపోయాయి. ప్రేమకథ బోరింగ్‌గా ఉందని.. కామెడీ ఒకే. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్బ్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అస్సెట్ గా నిలిచిందని.. ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

#GameChanger Strictly Average 1st Half!

Follows a predictable commercial pattern so far. A few IAS blocks have came out well along with an interesting interval block. The love story bores and the comedy is over the top and ineffective. Ram Charan is doing well and Thaman’s bgm…

— Venky Reviews (@venkyreviews) January 9, 2025

‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ హాఫ్ అంత యావరేజ్‌గా సాగిన.. సెకండ్ హాఫ్‌లో వచ్చిన అప్పన్న క్యారెక్టర్ సినిమాను సేవ్ చేసిందని.. ఇక్కడ వచ్చే రామ్ చరణ్ సీన్స్ సినిమాకే హైలెట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

2nd half #GameChanger

Average 1st half tarvata , Shankar mark blockbuster 2nd half padindi

Appanna character single handed ga movie ni safe chesadu , #RamCharan jeevinchadu Appanna ga

2nd half Ram & Moppi conflict 🔥 #GameChangerReview

— Ajay Varma (@AjayVarmaaa) January 9, 2025
 

#GameChanger First Half Review : “BELOW AVERAGE”

👉The first half struggles to make an impact, with the interval twist being the sole highlight.

👉#Shankar’s lackluster direction, combined with #KarthikSubbaraj’s underwhelming story, results in a tedious screenplay.…

— PaniPuri (@THEPANIPURI) January 9, 2025