RaaMachaMacha: గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్.. తమన్ బీట్కి చరణ్ కుమ్మేశాడుగా!

RaaMachaMacha:  గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్.. తమన్ బీట్కి చరణ్ కుమ్మేశాడుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ అది కూడా శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తుండటంతో.. గేమ్ ఛేంజర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా మెగా ఫ్యాన్స్ను ఖుషి చేయడానికి గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన 'రా మచ్చా మచ్చా' (Raa Macha Macha) పాట నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇంటెన్స్ డ్యాన్స్ వైబ్స్తో చరణ్ దుమ్ములేపేశాడు. 'జరగండి జరగండి' అంటూ ఫస్ట్ లిరికల్తో జోష్ పెంచిన తమన్..ఈ సారి మచ్చా అంటూ బాక్సులు పగిలిపోయేలా సౌండ్ ట్రాక్ ఇచ్చిపడేశారు. 

ALSO READ | SWAG Trailer: శ్రీ విష్ణు స్వాగ్ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

ఇక శంకర్ విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఈ పాటలో విజువల్స్ ఉన్నాయి. రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను..నకాష్ అజీజ్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్గా, గ్రాండియర్ గా ఉన్న ఈ పాట సినిమాకే హైలెట్ కానుందని టాక్. ఇక మొత్తంగా చరణ్ ఫ్యాన్స్కి ఇచ్చిన ఈ గిఫ్ట్ మెగా అభిమానుల్లో ఖుష నింపింది.

ఇపుడీ రా మచ్చా మచ్చా సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. కాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ కొంపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శంకర్, తమన్, SJ సూర్య, హీరో శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజ్ పాల్గోన్నారు. 

ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ ఉండనుందని టాక్. అయితే, సంక్రాంతి బరిలో ఉన్న చిరు విశ్వంభర మూవీ పోస్ట్ ఫోన్ అవునుందని.. ఆ ప్లేస్ లో చరణ్ గేమ్ ఛేంజర్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. త్వరలో రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.